calender_icon.png 10 March, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాడంబరతకు ప్రతిరూపం.. అదనపు కలెక్టర్ శ్రీజ..!

05-03-2025 01:05:43 AM

వైరా, మార్చి 4 :   ఆమె ఓ జిల్లాకు అదనపు కలెక్టర్... ఆమె పనితీరు.. ప్రవర్తనా నియ  చూసినవారు  ఎవ రైనా వాహ్వా అనాల్సిందే...! ఎదిగిన కొద్దీ.. ఓదగటం అనే మాటలను కేవలం మాటల్లో.. పాటల్లోనే విన్నాం.. కానీ.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామా నికి చెందిన ఉపాధి కూలీలు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ రూపంలో చూసి ఆనందంతో పాటు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  శ్రీజ  వైరా మండల పరిధిలోని  స్నానాల  లక్ష్మీపురం గ్రామం నర్సరీని ఆకస్మికంగా సందర్శించారు.

ఉపాధి కూలీలు చేస్తున్న పనితీరును పరిశీలించారు..కలెక్టర్ స్థాయి వ్యక్తి వచ్చి తమ కళ్ల ముందు నర్సరీలో కటిక నేలపై కూర్చొని ఇంటి మనిషిలా మాట్లాడిన మాటలకు అక్కడ పని చేస్తున్న ఉపాధి కూలీలు  ఫిదా అయ్యారు.. ఆ స్థాయిలో వ్యక్తి తమతో పాటు సమానంగా కూర్చోవటం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. ప్రభుత్వ పథకాలను గూర్చి అవగాహన కల్పించడం.. విద్యా వైద్య ఆరోగ్యంతో పాటు సామాజికాంశాలపై చర్చించడం  తో .. ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ వారి మనసుల్లో  చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు..