ఆదిలాబాద్,(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనమైన కాళోజీ నారాయణరావు అని అదనపు కలెక్టర్ శ్యామల దేవి అన్నారు. కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా సోమవారం అదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నువ్వు జి నారాయణ కవిత్వం ఎంతో మందికి ఆదర్శమని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కాలుజిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభి గ్యాన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.