calender_icon.png 26 October, 2024 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రణాళికాబద్దంగా గణేష్ నిమజ్జనం ఏర్పాటు చేయాలి

12-09-2024 03:49:01 PM

వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై ఉత్సవ కమిటీసభ్యులు, అధికారులతో అదనపు కలెక్టర్ శ్యాం లాల్

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహించడానికి  సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్  సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ, మండల స్థాయిలో గణేష్ నిమజ్జనాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ్ కమిటీ సభ్యులు సమన్వయ సమావేశాలు నిర్వహించు కోవాలని,  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, గణేష్ విగ్రహం నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని,  నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

గణేష్ నిమజ్జనానికి  మంచినీరు , విద్యుత్ , పారిశుధ్యం , మెడికల్, లైటింగ్ వంటి సౌకర్యాలు వుండేలా చూడాలని అన్నారు. గణేష్ నవరాత్రులు ముగించి నిమజ్జనం చేసే సందర్భంలో అగ్ని మాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి నిమజ్జన స్థలం వద్ద అందుబాటులొ వుండాలని అన్నారు. నిమజ్జన ప్రదేశాలలో గతంలో కంటే అధిక సంఖ్యలో గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని  జిల్లా మత్స్య శాఖ అధికారికి అదనపు కలెక్టర్ సూచించారు. వినాయక నిమజ్జన స్థలాల వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.  వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, ప్రతి నిమజ్జన స్థలం వద్ద అదనపు ట్రాన్స్ ఫారంలు, పవర్ జేనరేటర్లను  ముందు జాగ్రత్త కింద అందుబాటులో ఉంచాలని,  వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా  జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో. హనుమా నాయక్, ఏసీపీలు మడత రమేష్, జి. కృష్ణ, జిల్లా అధికారులు, గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.