calender_icon.png 30 December, 2024 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు

12-09-2024 08:00:30 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): వర్షాకాలం అయినందున ప్రజల ఆరోగ్యం దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలో ఏర్పాటు చేసిన పలు వైద్య శిబిరాలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలం అయినందున ప్రజా సంక్షేమం దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 55 గ్రామాలలో వైద్య-ఆరోగ్యశాఖ సిబ్బందితో వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని, గ్రామపంచాయతీ సిబ్బందితో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలకు అందుబాటులో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనుమానితుల నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షల అనంతరం తగు వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ప్రజలు భయాందోళన చెందవద్దని తెలిపారు. వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, జ్వర లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.