calender_icon.png 23 October, 2024 | 11:53 AM

తినే ఆహారంలో ఎందుకు వేస్తారు : అదనపు కలెక్టర్

09-07-2024 03:22:56 PM

సంగారెడ్డి : సాధారణంగా చట్నీలో మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర కరివేపాకు వంటి పోపుగింజలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఎలుకలే ప్రత్యేక్షం అవుతున్నాయేంటో. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం చోటు చేసుకుంది. పాత్రాలకు సరిగా మూత పెట్టకపోవడంతోనే చట్నీ గిన్నెలో ఎలుక పడిందని విద్యార్థులు తెలుపుతున్నారు.

ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటిన్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... వీడియో తీసి సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కాలేజీ ప్రిన్సిపల్ స్పందన శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో పడిందని ఆమె స్పష్టం చేశారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటీన్ చట్నీలో ఎలుక ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ మాధురి స్పందించారు. క్యాంపస్ కు వచ్చిన విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.

కిచెన్ శుభ్రంగా లేకపోవడంతోనే క్యాంటీన్ లో ఎలుకలు తిరుగుతున్నట్లు ఆమె గుర్తించారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ పై అదనపు కలెక్టర్ మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెన్ కాంట్రాక్టర్ ని మార్చాలని ప్రిన్సిపాల్ కి అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులే కావాలని చట్నీలో ఎలుక వేశారని ప్రిన్సిపల్ తెలిపారు. తినే ఆహారంలో ఎందుకు వేస్తారని ప్రిన్సిపల్ ను అదనపు కలెక్టర్ నిలదీశారు.