నిర్మల్,(విజయక్రాంతి): దివ్యాగుల్లో ఆత్మస్తుర్యైం ఎక్కువగా ఉంటుందని వారు పట్టుదల తో సాధన చేస్తే దెన్ని అయిన సాధించగలరని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలొ వచ్చె నెల 5న జరుగన్ను ప్రపంచ దివ్యాంగుల దినంను పురష్కరించుకొని దివ్యాంగుల సంక్షేమా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోలటీలను ప్రారంభం చేశారు. దివ్యాంగులతో కలిసి క్రీడలు ఆడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వతాలు ఆనేక పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దివ్యాగులు ఉచితంగా పరికరాలు ట్రై సైకిల్‌లు అందించడం జరుగుతంన్నారు. ప్రభుత్వ ద్వారా ఉద్యోగాల భర్తి చదువకునేందకు క్రీడల్లో రిజర్వేషన్ సదుపాయాలు అందుబాటు ఉంటాయని తెలిపారు. క్రీడా పోటిల్లో పాల్గోంటున్న వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీకాంత్ రెడ్డి, నాగమణి, విజయలక్ష్మీ, పీఈటీలు భూమన్న, వెన్నెల అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.