మెదక్, జనవరి 13(విజయక్రాంతి)ః భోగి పండుగ సందర్భంగా సోమవారం నాడు మెదక్ మండలం ముత్తాయికోట శివాల యాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. వేద పండితులు శివలింగానికి అభి షేకం నిర్వహించి ఆశీర్వచనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లా డుతూ ఆ పరమశివుని ఆరాధిస్తే అష్టైశ్వ ర్యాలు కలుగుతాయని, హర హర మహాదేవ శంభో శంకర అనగానే బోలా శంకరుడు భక్తుల కోరిన కోరికలు తీరుస్తా డని తెలిపారు. అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.