08-04-2025 04:09:03 PM
ఖమ్మం,(విజయక్రాంతి): కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవిన్యూ) పి.శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. రైతులతో, ఐకేపీ సమాఖ్యలతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్ గౌడ్, తాసిల్దార్ పులి సాంబశివుడు, కల్లూరు వ్యవసాయ అధికారి రూప, ఐకెపి ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.