calender_icon.png 4 January, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఎం.డేవిడ్

02-12-2024 06:30:52 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీపై వచ్చిన ఎం. డేవిడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు కలెక్టర్ వెంకటేష్ దోత్రేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను మండల, జిల్లా అధికారులతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధి, విధి నిర్వహణలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ పర్యవేక్షకులు, జిల్లా అధికారులు బదిలీపై వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. గతంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఆయన విధులు నిర్వహించారు.