21-04-2025 05:48:18 PM
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించి 33, మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్7, డి.ఆర్.డి.ఓ5, ఎంప్లాయ్మెంట్ 3 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో జెడ్.పి సీ.ఈ.ఓ పురుషోత్తం, తొర్రూరు ఆర్డీఓ గణేష్, డి.ఆర్.డి.ఓ మధుసూదనరాజు, సి.పి.ఓ సుబ్బారావు, డి.పి.ఓ హరిప్రసాద్, డి.సి.ఓ వెంకటేశ్వర్లు, డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, బి.సి, ఎస్.సి డెవలప్మెంట్ అధికారులు నరసింహా స్వామి, శ్రీనివాసరావు, డి.ఎం.సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్, జి.ఎం.ఇండస్ట్రీస్ శ్రీమన్నారాయణ, మత్స్య శాఖ అధికారి వీరన్న, ఎల్.డి.ఎం సత్యనారాయణ మూర్తి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, వివిధ మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.