సిరిసిల్ల, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : జనవరి 1 నుంచి ఆన్ లైన్ ద్వారా అధికా రులు సెలవు దరఖాస్తులు సమర్పించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ -హె ఆర్ ఎం పోర్టల్ ద్వారా సెలవు మంజూరు దరఖాస్తు ల నమోదుపై ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిధిలోని ఈ-ఆఫిస్ లాగిన్ ఐడి వినియోగించుకుని ఉద్యోగుల జాబితా, వివరాలను అప్ డేట్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.