17-04-2025 01:35:11 AM
మునగాల ఏప్రిల్ 16 : సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఎస్సీ బాలికల హాస్టల్, వంట గదిని సరుకులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిడిఎస్ బియ్యమును పరి శీలించిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అదేవిధంగా బరకత్ గూడెంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఒక్కడే ఉన్న రైతులతో మాట్లాడి అదేవిధంగా సెంటర్ ఇన్చార్జికి ప్రతిరోజు ధాన్యం తీసుకువచ్చే రైతుల వివరాలు నమోదు రిజిస్టర్ లో నమోదు చేయాలని అదేవిధంగా మ్యాచరు పరిశీలించి నమోదు చేయాలని ఏ రోజు కా రోజు కాంటావేసిన ధాన్యమును మిల్లులకు తరలించాలని సూచించారు అదేవిధంగా అకాల వర్షాలు ఉన్నందున ధాన్యం రాశులపై తడవకుండా పట్టాలు కట్టాలని సూచనలు జారీ చేసినారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు ఎంఈఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ శ్వేత ఏ ఈ ఓ రేష్మ పి ఎస్ ఎస్ సి ఓ బసవయ్య సెంటర్ ఇన్చార్జ్ సుందరయ్య. తదితరులు పాల్గొన్నారు.