calender_icon.png 6 February, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

06-02-2025 12:00:00 AM

జగిత్యాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): జగిత్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్.లత బుధవారం కోరుట్లలోని ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ నెల 27 న జరగనున్న ‘మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్’ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేందుకు కోరుట్లలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ సెంటర్లను పరిశీలించారు.

ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పా ట్ల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిక చేసిన 225, 226, 227, 228 నెంబర్లు గల పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లను, 142 నెంబర్ ఉపాధ్యాయుల పోలింగ్ స్టేషన్ సందర్శించి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాల న్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సిబ్బందిని, వస్తు సామాగ్రిని ముం దస్తుగా సమకూర్చుకోవాలని అధికారులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీ వాకర్’రెడ్డి, తహసిల్దార్ ఇట్యాల కిషన్, తదిత రులు పాల్గొన్నారు.