calender_icon.png 19 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ తనిఖీ

11-04-2025 12:00:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మల్కాజిగిరి లోని జిల్లా ఆస్పత్రిని అదనపు కలెక్టర్ రాధిక గుప్త గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా, ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వ హిస్తున్న సదరం శిబిరాన్ని ఆమె పరిశీలించారు. శిబిరంలో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి  , సిబ్బంది, లబ్ధిదారులతో మాట్లాడుతూ శిబిరం నిర్వహణ తీరును సేవలు సమర్థవంతంగా అందుతున్నాయా అనే విష యాన్ని పరిశీలించారు.

తర్వాత, ఆమె ఆరోగ్య శాఖ, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆసుపత్రి వైద్యులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి  మొత్తం కార్యకలా పాలు  మౌలిక వసతుల అవసరాలపై సమీక్ష చేశారు.

ఆసుపత్రిలో మంచినీటి వసతి తక్కువగా ఉందని గుర్తించి, త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ, అధికారులను త్వరితగతిన ప్రతిపాదనను సమర్పించాలని ఆమె ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సి. ఉమా గౌరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్యకళాశాల డా మురళి కృష్ణ, జిల్లా ఆరోగ్య సేవల సమన్వయ అధికారి డా. సునీత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సాం బశివరావు, జిల్లా ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డా. సంగీత్ పాల్గొన్నారు.