calender_icon.png 2 February, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన బాలిక వసతి గృహం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

29-01-2025 06:51:51 PM

ఇల్లెందు (విజయక్రాంతి): టేకులపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వసతి గృహంలోని బాలికలకు నాణ్యమైన భోజనం తయారు చేయాలని, మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి మెనూ అమలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ బాలికల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఉన్నారు.