మునగాల (విజయక్రాంతి): మండల పరిధిలోని బరఖత్ గూడెంలో పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ రాంబాబు. రైతులతో మాట్లాడుతూ.. నిర్వాహకులకు ఎఫ్ఏ క్యూబ్ ప్రకారం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వం సన్న ధాన్యంకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తుందన్న విషయం తెలియపరిచారు. కావున రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. గ్రామంలోని సోషియో ఎకనామిక్ సర్వే కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్, దీన్ దయ ఏవో రాజు, ఆర్ ఐ రామారావు, పి ఎస్ ఎస్ సీఈఓ బసవయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.