calender_icon.png 27 April, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు

26-04-2025 08:59:58 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్  దీపక్ తివారి అన్నారు. శనివారం  ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, పథకం నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూరే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.