calender_icon.png 9 February, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి నర్సరీ కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..

08-02-2025 11:04:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలోని మూలం గ్రామంలో శనివారం హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తనిఖీ నిర్వహించారు. నాటిన మొక్కల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. ఎండల నేపథ్యంలో గ్రీన్ నెట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నపిల్లలకు ప్రతిరోజు అందిస్తున్న పోషకాహారంపై అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట అధికారులు సిబ్బంది ఉన్నారు.