calender_icon.png 4 October, 2024 | 6:51 PM

కాంట్రాక్టర్ తీరుపై అదనపు కలెక్టర్ ఆగ్రహం.

04-10-2024 03:10:43 PM

పదివేల జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశం 

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెడికల్ ఆసుపత్రి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రిని ఇష్టానుసారంగా పడి వేయడంతో మురికినీరు నిలిచి ఉండడం వల్ల సదర్ కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. పదివేల రూపాయల జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు. ప్రస్తుతం కళాశాలలో తరగతులు నడుస్తున్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం కళాశాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ దత్త రావు, డిపిఎం రామకృష్ణ తదితరులు ఉన్నారు.