calender_icon.png 16 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ సిలిండర్‌పై అదనపు వసూళ్లు

16-11-2024 03:40:05 AM

సిబ్బంది ఒక డెలివరీపై రూ.40 వరకు డిమాండ్

మహబూబ్‌నగర్, నవంబర్ 15 (విజయక్రాంతి): గ్యాస్‌సిలిండర్ బుక్ చేసుకున్న విని యోగదారులు, ఆ సిలిండర్‌కు డబ్బు చెల్లిస్తుండగానే.. ఇంటికి డెలివరీ ఇచ్చిన సిబ్బం ది వారి నుంచి రూ.40 నుంచి రూ.50 వర కు వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌కు వినియోగదారుడు రూ.858.50 చొప్పున చెల్లించాల్సి ఉండగా, అదనపు సొమ్ము కలి పి రూ.900 వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని మొత్త 2,49,297 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకుంటారు. వీరంతా ఒక్కసారి సిలిండర్ బుక్ చేసుకుంటూ ఒక్కో సిలిండర్‌కు అదనం రూ.40 చొప్పున రూ.99,71,880 వసూలవుతుందని ఓ అంచనా. కనెక్షన్లు ఉన్న వారిలో సగం మం ది లబ్ధిదారులైనా నెలలో బుక్ చేసుకున్నా నెలకు రూ.40 లక్షల సొమ్ము వినియోగదారుల నుంచి వెళ్తున్నట్లు లెక్క. రీఫిల్ శాతం తక్కువ ఉంటే తక్కువగాను, ఎక్కువ ఉంటే ఎక్కువగాను వినియోగదారుల నుంచి సిబ్బంది సొమ్ము వసూలు చేస్తున్నారు.

ఏజెన్సీల ప్రోత్సాహం..

గ్యాస్ సరఫరా చేస్తున్న సిబ్బందిని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు సైతం ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ‘మేం ఎంతో కొంత వేతనం ఇస్తాం. మిగతాది అనధికారికంగా సిలిండర్‌కు రూ.40 వరకు వినియోగ దారుడు ఇస్తాడు’ అనే పద్ధతిలో ఏజెన్సీలు వెళ్తున్నట్లు సమాచారం. దీనిపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని, చేస్తే చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లు అధికారులు చెప్తున్నారు. ఏజెన్సీలు సిలిండర్ల వినియోగం, వారి హక్కులపై ఎలాంటి  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు.

నిబంధనలు పాటించాలి 

గ్యాస్ ఏజెన్సీల నిర్వహకులు నిబంధనలు పాటించాలి. అందుకు అనుగుణం గానే వినియోగదారులకు గ్యాస్ సిలిండ ర్లు సరఫరా చేయాలి. వారి నుంచి అదనంగా సొమ్ము వసూలు చేయడం నిబం ధనలకు విరుద్ధం. నిబంధనలు పాటించని యాజమన్యాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.

-శ్రీనివాస్, డీఎస్వో, మహబూబ్‌నగర్