calender_icon.png 5 November, 2024 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక బస్సుల్లోనే అదనపు చార్జీలు

05-11-2024 01:47:56 AM

ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): కొన్ని రూట్లలో బస్సు చార్జీలను పెంచినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీపా వళి సందర్భంగా తిరుగు ప్రయాణం లో నెలకొన్న భారీ రద్దీ కారణంగా నడిపిన ప్రత్యేక బస్సుల్లోనే అదనపు చార్జీలు ఉన్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేందుకు నిబంధనలున్నాయని సోమ వారం ఒక ప్రకటనలో చెప్పారు.

తిరుగు ప్రయాణంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి ఉన్న రద్దీ కారణంగా వేసిన ప్రత్యేక బస్సుల్లోనే అదనంగా చార్జీలు వసూలు చేశామని స్పష్టంచేశారు. మొత్తంగా 360 బస్సులను హైదరాబాద్‌కు నడిపించామని చెప్పారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే ఉన్నాయన్నారు.