calender_icon.png 6 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరాకు అదనపు బస్సులు

03-10-2024 12:05:05 AM

ఖమ్మం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): దసరా పండుగను పురష్క రించుకుని టీజీఎస్‌ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ తో సహా  వివిధ  ప్రాంతాలకు ప్రత్యే క బస్సులను నడుపనున్నది. జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొ త్తగూడెం, మణుగూరు, భద్రాచల ం, ఇల్లెందు డిపోల నుంచి 724 ప్ర త్యేక బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులను ఈ నెల ఒకటి నుంచి  11వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు నడుపుతారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల కు , 13, 14 తేదీల్లో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు  నిత్యం తిరిగే 154 బస్సులతో పాటు 100 బస్సులను అదనంగా నడపనున్నారు.