calender_icon.png 7 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి కలెక్టరేట్‌కు అదనపు బస్సు కేటాయింపు

07-02-2025 12:00:00 AM

హర్షం వ్యక్తం చేసిన టీజీవో నాయకులు డాక్టర్ కే. రామారావు,శ్రీనేష్ కుమార్ నోరి

రంగారెడ్డి జిల్లా (విజయక్రాంతి), ఫిబ్రవరి 6: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు అదనపు బస్సును ఏర్పాటు చేశారు. టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు నాయకత్వంలో  రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అదనపు బస్ సర్వీసులను కలెక్టరేట్ కు కేటాయించాలని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాలతో   హైదరాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత చర్యలు తీసుకున్నారు  మిథాని డిపో నుంచి ఒక బస్సు రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మధ్యాహ్నం 2:40  కు బయలుదేరుతుంది.

ఈ బస్సు తో పాటు అదనంగా మరొక బస్సును  కేటాయించారు. ఇది సాయంత్రం 6 గంటలకు రంగారెడ్డి కలెక్టరేట్ నుండి బయలుదేరుతుంది. మంత్రి ప్రభాకర్ కు, అదేవిధంగా  ఈ బస్సు సౌకర్యం కోసం కృషిచేసిన  టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.