calender_icon.png 11 January, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఈ-రేసు’ కేసును తోడితే మరిన్ని చీకటి కోణాలు

11-01-2025 12:03:39 AM

ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేసు కేసును తోడితే మరిన్ని చీకటి కోణా లు బయటపడతాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. నిధుల మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలని  కోరారు. తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్-2025 క్యాలెండర్‌ను టీజేఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కోదండరాం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్లను అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. కాళేశ్వరం కుంగడానికి నిర్మాణలోపాలే కారణమని నిపుణు లు చెప్పారన్నారు.