calender_icon.png 3 April, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ గా ఆదర్శ్ రెడ్డి నియామకం

02-04-2025 10:44:58 PM

పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ గా రామచంద్రాపురం పట్టణానికి చెందిన వెన్నవరం ఆదర్శ్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. బుధవారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం  బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో ఈనెల 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ... ఈ అవకాశం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.