కేఎస్‌కే మహానది పవర్ ప్లాంట్ కొనుగోలుకు ఆఫర్
ముంబై, ఆగస్టు 4: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న కేఎస్‌కే మహానది పవర్‌కు చెందిన 18,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ రూ.27,000 కోట్లు ఆఫర్ చేసింది. ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్ విక్రయానికి బ్యాంక్‌లు ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించగా, అన్నింటికంటే అధిక ధరకు ఆదానీ బిడ్ చేసింది. అదానీ గ్రూప్ తో పాటు కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, వేదాంత, సజ్జన్ జిందాల్‌కు చెందిన జిందాల్ పవర్ అండ్ స్టీల్, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్, ఐల్యాబ్ ఇండియా స్పెషల్ ఫండ్, రాష్మి మెటాలిక్స్, శ్రేష టెక్నాలజీస్‌ల నుంచి 10 ఫైనాన్షియల్ బిడ్స్‌ను బ్యాంక్‌లు అందుకు న్నాయి.
కేఎస్‌కే మహానది పవర్ నుంచి వివిధ బ్యాంక్‌లకు రావాల్సిన రుణ బకాయి ల్లో 92 శాతాన్ని అదానీ పవర్ రూ.27,000 కోట్ల ఆఫర్ కవర్ చేస్తుంది. అదానీ ఆఫర్‌లో భాగంగా రూ.12,500 కోట్ల నగదును ముం దస్తుగా చెల్లిస్తుంది. అలాగే మహానది పవర్ కు చెందిన మూడు యూనిట్లు పనిచేస్తున్న ప్పటి నుంచి ఉన్న రూ. 9,000 కోట్ల నగదు నిల్వలను, ఆ ప్లాంట్‌కు అందాల్సిన రూ. 5,500 కోట్ల బకాయిల్ని చెల్లించేవిధంగా అదానీ బిడ్ వేసింది. రెండవ అత్యధిక బిడ్ ను క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ సమర్పించింది. కంపెనీ వద్దనున్న నగదు, వసూలయ్యే నగదు, ముందస్తు చెల్లింపులతో కలిపి క్యాప్రి మొత్తం రూ. 25,000 కోట్లు ఆఫర్ చేసింది.
మూడవ పెద్ద బిడ్డర్ అయిన ఎన్‌టీపీసీ రూ.22,200 కోట్లకు ఫైనాన్షియల్ బిడ్ వేసింది. ఇందులో రూ.7,700 కోట్లు ముం దస్తు నగదు చెల్లింపుకాగా,మహానది పవర్ వద్దనున్న నగదు నిల్వ, ఆ కంపెనీకి రావాల్సి న మొత్తం కలిపి రూ.14,500 కోట్ల మేర బిడ్‌లో భాగంగా ఉన్నాయి.
రూ.29,330 కోట్ల క్లెయింలు
కేఎస్‌కే మహానది పవర్ నుంచి రుణదా తలు రూ.29,330 కోట్ల బకాయిల్ని క్లెయిం చేస్తున్నట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ సుమీత్ బినాని వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్ ప్రమోట్ చేసిన ఈ థర్మల్ పవర్ కంపెనీ చత్తీస్‌ఘర్‌లో 600 మెగావాట్ల చొప్పున మూడు యూని ట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది.