calender_icon.png 16 January, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీకి రూ.7,148 కోట్లు

10-01-2025 12:00:00 AM

విల్మార్ వాటా విక్రయం

న్యూఢిల్లీ, జనవరి 9: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్‌లో 13 శాతం మేర అదానీ గ్రూప్ వాటా విక్రయించి రూ. 7,148 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీలో మెజారిటీ వాటాను జాయింట్ వెంచర్ భాగ స్వామికి విక్రయిస్తున్నట్లు గతంలోనే అదానీ గ్రూప్ ప్రకటించింది. తాజాగా 17.54 కోట్ల షేర్లను జనవరి 10న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు, జనవరి 13న రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్లో విక్రయిస్తుంది. ఇందుకోసం ఒక్కో షేరుకు రూ.275 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు గురువారం అదానీ గ్రూప్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. 

16న రిలయన్స్ ఫలితాలు 

మార్కెట్ విలువలో అతిపెద్ద దేశీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3 ఆర్థిక ఫలితాల్ని జనవరి 16న వెల్లడించనుంది. ఈ విషయాన్ని గురువారం కంపెనీ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలిపింది.