calender_icon.png 5 November, 2024 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌కు అదానీ షాక్

03-11-2024 02:03:11 AM

  1. పంపిణీ చేస్తున్న పవర్ సగానికి కట్
  2. బకాయిలు చెల్లించకపోవడంతో చర్యలు

న్యూఢిల్లీ: అదానీ పవర్‌కు చెందిన అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ (ఏపీజేఎల్) బంగ్లాదేశ్‌కు షాక్ ఇచ్చింది. బంగ్లాకు గత కొద్ది రోజులుగా కరెంటును సప్లు చేస్తున్న ఏపీజేఎల్ తాజాగా ఆ మొత్తాన్ని సగానికి తగ్గించింది. బంగ్లాదేశ్ 846 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గురువారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ పంపిణీనిని తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో బంగ్లాదేశ్‌లో కరెంటుకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. బంగ్లాకు కావల్సిన కరెంటును అందిస్తూ వస్తున్న అదానీ పవర్ ఒక్కసారిగా ఇంత పెద్ద నిర్ణ యం తీసుకోవడంతో బంగ్లాకు ఊహించని ‘షాక్’ తగిలింది.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లా ద్రవ్యోల్బ ణంతో పాటు అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ దిగుమతుల మీద బంగ్లా అతిగా ఆధారప డుతూ వస్తోంది. కానీ ఇప్పుడు అదానీ పవర్ ఇచ్చిన ‘షాక్’తో ఏం చేయాలో పాలుపోని స్థితికి బంగ్లా చేరుకుంది.

బంగ్లా ఎటు పోతోంది..

అదానీ కంపెనీ చర్యతో బంగ్లా పరిస్థితి చర్చనీయాంశం అయింది. ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పడ్డారంటే అసలు నిత్యావసర బకాయిలు తీర్చే స్థోమత కూడా ఆ దేశానికి లేదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటడంతోనే బంగ్లా ఈ అప్పులు తీర్చడంలో విఫలమవుతూ వస్తోందని పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నా యి.

అసలే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాకు ఈ అదానీ ‘షాక్’ పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక అక్కడ ప్రస్తుతం ద్రవ్యోల్బణం రెక్కలు చాచడంతో నిత్యావసరాలు కొండెక్కి కూర్చుకున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడంతో తాత్కాలిక ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువత ఏరి కోరి తెచ్చుకున్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్  ఈ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.