calender_icon.png 18 October, 2024 | 10:53 PM

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అదానీ గ్రూప్ భారీ విరాళం

18-10-2024 08:48:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అదానీ గ్రూప్ చైర్ పర్సన్ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ నుంచి ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం కలిశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు, యువత నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో  ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన కోసం అదానీ గ్రూప్ సంస్థ రూ.100 కోట్ల చెక్కును విరాళాన్ని అందించింది.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలో అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేసింది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి గౌతమ్ అదానీ నిరంతర మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలను అందించడంలో రాష్ట్ర ప్రయత్నాలను ఈ విరాళం గణనీయంగా బలపరుస్తుందని భావిస్తున్నారు.