calender_icon.png 8 October, 2024 | 5:00 AM

మరో కొత్త సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను

08-10-2024 02:43:22 AM

న్యూఢిల్లీ: దేశంలో తమ సిమెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్ మెటీరియల్స్ ఇండియన్ యూనిట్ హైడెల్‌బెర్గ్ సిమెంట్ ఇండియాను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్ ద్వారా రూ.10వేల కోట్లకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

అదానీ గ్రూప్ కొనుగోలు వార్తల నేపథ్యంలో హైడెల్‌బెర్గ్ ఇండియా షేర్లు సోమవారం దూసు కెళ్లాయి. ఇంట్రాడేలో 18 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 17.95 శాతం లాభం తో 52 వారాల గరిష్ఠ స్థాయికి రూ.257.85 చేరింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ షేరు ధర రూ.258ని తాకింది. తర్వాత షేరు ధర క్షీణించింది. అటు అంబుజా సిమెంట్ షేర్లు మా త్రం 2.21 శాతం మేర పతనమయ్యాయి.