calender_icon.png 25 November, 2024 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

25-11-2024 10:41:47 AM

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంతో దూసుకుపోతుంది. నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభంలో ఉంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 1,261 పాయింట్ల లాభం నమోదు చేసింది. నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలో 397 పాయింట్ల లాభం నమోదు చేసింది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయంతో సూచీలు సానుకూలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ సంకేతాలతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ. 84.35 గా ఉంది.