స్మార్ట్ మీటర్ టెండర్‌ను క్యాన్సిల్ చేసిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై, జనవరి 1: అదానీ గ్రూప్‌నకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. స్మార్ట్ మీటర్ల కోసం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సమర్పించిన టెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వపు విద్యుత్ పంపిణీ స్కీమ్‌లో భాగంగా స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 2023 ఆగస్టులో నాలుగు ప్యాకేజీలుగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.
ఆ టెండర్‌లో 82 లక్షల స్మార్ట్‌మీటర్లను చెన్నైతో సహా 8 జిల్లాలను కవర్‌చేసే ప్యాకేజ్ 1కు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లోయస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. అయితే అదానీ ఎనర్జీ కోట్ చేసిన ధర అధికంగా ఉన్నదంటూ టెండర్‌ను 2024 డిసెంబర్ 27న క్యాన్సిల్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.