calender_icon.png 26 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ ఒప్పందాలను రద్దు చేయాలి

26-11-2024 03:09:25 AM

దావోస్‌లో ఒప్పందం మాటేమిటి? 

ఎక్స్ వేదికగా మాజీమంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చి న రూ.100కోట్ల నిధులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్.. దావోస్‌లో ఆయనతో ఒప్పందం చేసుకున్న రూ. 12,400కోట్ల సంగతేమిటని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్‌గాంధీ నినదిస్తున్నందున.

దావోస్‌లో ఒప్పందం మాటేమిటని నిలదీశారు. అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేం దుకు చేస్తున్న కుట్రల మాటేమిటన్నారు. 20వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామని ప్రతిపాదనలతో వస్తే, మర్యాదపూ ర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపిచారని విమర్శించారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని.. అదానీ అవినీతిపరు డని రాహుల్‌గాంధీ అంటే.

అటువంటి వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందన్నారు. ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా రాహు ల్ పోరాటం చేస్తుంటే.. సీఎం రేవంత్ దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని మండిపడ్డారు. అదానీ అవినీతి బయట పడగానే ఇప్పడు మాట మార్చుతున్నారన్నారు. ప్రభు త్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.