calender_icon.png 18 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

11-04-2025 07:50:01 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పలువురి ఎరువుల దుకాణాలను శుక్రవారం ఏడిఏ అనిత ఆకస్మిక తనిఖీ చేశారు.  రైతులకు ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. డీలర్లు అందరూ ప్రతిరోజు ఎరువుల నిల్వలని ఈ పాస్ మిషన్ నిల్వలతో సరిపోలుస్తున్నారా అని పరిశీలించారు. రైతులు కూడా ఎరువుల కోనుగోలు ఆధార్ కార్డ్ ఆధారంగానే చేయాలని సూచించారు. డీలర్లు ప్రతి రోజు తప్పనిసరిగా ఎరువులు, విత్తనాలు,పురుగుమందుల స్టాకు బోర్డు రైతులకు కనపడే విధంగా ప్రదర్శించాలని సూచించారు. అనంతరం రైతుల పంట వివరములను ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్ చేయాలని ఏవో కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈఓ, తదితరులు పాల్గొన్నారు.