calender_icon.png 20 March, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవానికి దగ్గర్లో బడ్జెట్

20-03-2025 01:20:17 AM

గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ట్కు భిన్నంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని, గతంలో అంకెల గారడీ స్పష్టంగా కనిపించగా ప్రస్తుత బడ్జెట్ వాస్తవానికి దగ్గరలో ఉందని, గత బడ్జెట్ కంటే 14,505 కోట్లు తగ్గుదలతో బడ్జెట్ ప్రెవేశపెట్టడం ఇందుకు నిదర్శనమని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు.

అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జ్పె సాబీర్ పాషా స్పందిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముందస్తు వ్యూహంలో భాగమేనన్నారు. ఆరు గ్యారంటీలకోసం 56వేల కోట్లు కేటాయించడం ఆహ్వానించదగిందే, అయినప్పటికీ ఆచరణ అనుమానమేనన్నారు.  ఆయా రంగాలకు కేటాయించిన బడ్జెట్లోని ప్రతి పైసా పూర్తి స్థాయిలో ఖర్చుచేస్తేనే ప్రజలు హర్షిస్తారాన్ని అన్నారు.