calender_icon.png 1 January, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటి శోభిత మృతదేహం అప్పగింత

03-12-2024 12:44:35 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 2: బుల్లితెర కన్నడ నటి శోభిత (32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం శోభిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శోభిత మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్త సుధీర్‌రెడ్డితో పాటు చుట్టుపక్కల వారితో వీరి వైవాహిక జీవితం గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు.

వీరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే శోభిత డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకుందా? లేక ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో విచారిస్తున్నారు.

కర్ణాటక నుంచి వచ్చిన శోభిత బంధువులు ఆమె మృతిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మ్యాట్రిమోనిలో శోభిత ప్రొఫైల్ చూసిన సుధీర్‌రెడ్డి ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధీర్‌రెడ్డిని పెండ్లి చేసుకున్న తర్వాత శోభిత నటనకు దూరంగా ఉందని తెలిపారు.