calender_icon.png 4 April, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలోకి నటి రూపాలీ

02-05-2024 12:17:38 AM

న్యూఢిల్లీ, మే 1: ప్రముఖ నటి రూపాలీ గంగూలీ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కార్యా లయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె చేరిక సమయంలో పార్టీ నాయకులు వినోద్ తావ్డే, అనిల్ బలూని సహా పలువురు నాయకులు ఉన్నారు. అనుపమ, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వంటి సీరియళ్లతో రూపాలీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని మోదీ పనితీరుకు, వ్యక్తిత్వానికి ఆకర్షితురాలినై, జరుగుతున్న అభివృద్ధిని చూసి అందులో భాగస్వామి అయ్యేందుకే బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.