calender_icon.png 22 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన సినీనటి మాధవీలత

21-01-2025 04:47:04 PM

సైబరాబాద్ కమిషనరేట్ లో పిర్యాదు చేసిన సినీనటి మాధవీలత 

హైదరాబాద్,(విజయక్రాంతి): నచ్చావులే,స్నేహితుడా చిత్రాల ఫేం సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై తెలుగుదేశం సీనియర్ లీడర్ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటీవల  తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాధవీలత  సైబరాబాద్ కమిషనరేట్ లో మంగళవారం జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించి, తన పరువుకు భంగం కలిగించారంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మాధవీలత ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా తాను సైబరాబాద్ కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాను. సినీ హీరోయిన్స్, మహిళలను అసభ్యంగా మాట్లాడి, తర్వాత క్షమాపణలు చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నించారు. అందుకే జేసీ చేసిన వ్యాఖ్యలపై సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. జేపీ వ్యవహారంపై తన కుటుంబసభ్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారంటూ మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు.