27-02-2025 12:00:00 AM
కొందరు ముద్దుగుమ్మలు డాక్టర్ అవడమే కాక యాక్టరూ అయ్యారు. వాళ్ల లో కామాక్షి భాస్కర్ల ఒకరు. మా ఊరి పొలిమేర, విరూపాక్ష, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర 2 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆరేళ్లు అక్కడే ఉన్న తర్వాత ఇండియాకు వచ్చి అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేసింది. కొంతకాలానికి వైద్యవృత్తిని వదిలేసి సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. అయితే చైనాలో ఉన్నప్పుడు కామాక్షి బొద్దింకలు, తేళ్లతో వండిన వంటకాలను రుచి చూసిందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “చైనాలో ఆరేళ్లు ఉన్న నాకు వంట చేయడం వచ్చు. అక్కడ నేనే వంట చేసుకుని తినేదాన్ని. చైనా ఫుడ్ గురించి తెలుసు. ఒకట్రెండు సార్లు టేస్ట్ చేశా. అప్పుడు బొద్దింకలు, తేళ్లు సైతం రుచి చూశా (నవ్వుతూ). నేనెక్కడికి వెళితే అక్కడి వంటకాలు టేస్ట్ చేస్తా. దీంట్లో భాగం గానే చైనీస్ వంటకాలూ తిన్నా’ అని చెప్పింది.