calender_icon.png 5 February, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత

21-01-2025 01:34:23 AM

ప్రముఖ నటుడు విజయ్ రంగరాజు మృతి చెందారు. వారం క్రితం షూటింగ్‌లో గాయపడిన ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పుణెలో జన్మించినా.. ముంబైలో పెరిగారు. 1994లో భైరవద్వీపం చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా ఇలా అన్ని పాత్రల్లోనూ భాషాభేదం లేకుండా ఆయన నటించారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 5 వేల చిత్రాల్లో నటించారు. గోపీచంద్ ‘యజ్ఞం’ సినిమాతో ఆయనకు గుర్తింపు లభించింది.