25-02-2025 12:00:00 AM
సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్ కాగా.. మన్మథుడు ఫేమ్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేశ్ దండా సోమవారం మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఇంతకు మేం విభిన్నమైన సినిమా చేయాలని ‘బచ్చలమల్లి’ చేశాం. ఇప్పుడు ‘మజాకా’.. ఇది ఫ్యామిలీ మూవీ. డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్న స్టుల్‌లో ఉండే మాస్ ఎంటర్‌టైనర్. ఇకపై కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమాలనే చేస్తా. పాటలు, ట్రైలర్ గ్యాప్ లేకుం డా రిలీజ్ చేశాం. -టీజర్ మాత్రం ముందే రిలీజ్ చేశాం. అది జనాల్లో ఉంది. ట్రైలర్ కంటే ముందు సోమ్మసిల్లి పాట రిలీజ్ చేశాం. అది టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మాకు రిలీజ్ డేట్ ముఖ్యం. దానికోసం అందరం కష్టపడి పనిచేశాం. లైవ్ షూ టింగ్ ఐడియా నిర్మాత -అనిల్‌ది.
రిలీజ్ డేట్‌కు తక్కువ టైమ్ ఉంది. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఆ ఆలోచన చెప్పారు. దానికి మంచి స్పందన వచ్చింది. పెయిడ్ ప్రిమి యర్స్ రేపు (మంగళవారం) వేస్తున్నాం. ఆల్రెడీ ఈ సినిమా చూశా. కచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమా. ఇంటర్వెల్‌కు మంచి ట్విస్ట్ ఉంటుంది. అది సెకండ్ హాఫ్‌ను ఎలా లీడ్ చేస్తోందనేది చాలా ఇంట్రస్టింగ్. సందీప్ రమేశ్ సీన్స్, సందీప్ లవ్‌స్టొరీ, రావు రమేశ్ ట్రాక్ కూడా చాలా బావుంటుంది.
సందీప్‌కు ‘భైరవ కోన’ కంటే బెటర్ సినిమా అవుతుంది. బిజినెస్ విషయంలోనూ -చాలా హ్యాపీ. ప్రాఫిట్స్‌లో రిలీజ్ చేస్తున్నా. సందీప్ కిషన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. ఫాదర్ రోల్‌కు ముందు నుంచీ రావు రమేశ్‌నే అనుకున్నారు -డైరెక్టర్. ఆయన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో కామెడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. -మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న టైటిల్ పెట్టాలనుకున్నాం. ఒక సెలబ్రేషన్ వైబ్ ఉన్న సినిమా ఇది. మాజకా టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది.
ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్ ఉంది. ఇద్దరు బ్యాచిలర్స్.. వాళ్ల ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫొటో పెట్టుకోవాలని తపన పడతారు. అది సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్.డైరెక్టర్ త్రినాథరావుతో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సినిమాను అద్భుతంగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలనుంది. ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉంది. సినిమా ఆఖరున డబుల్ మజాకా అనే టైటిల్ కూడా వేస్తాం. ఇప్పటికే -నా ఫ్రెండ్స్, కొంత మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా చూపించాం.
ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ చాలా బావుందని చెప్పారు. పాటలు చాలా ఎంజాయ్ చేశారు. నేను ఏదైతే నమ్మానో అది వర్క్ అవుట్ అయ్యింది. ఇంతకుముందు మేం చేసిన ‘సామజవరగమన’ సీక్వెల్ ఉంటుందని గతంలో ప్రకటించాం. అయితే -మా రైటర్ భాను రవితేజతో సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక కథ సిద్ధం చేయాలి. నిర్మాత అనిల్‌తో కొలాబరేషన్ బాగుంది. ఆయనా, నేను వచ్చే సంవత్సరం ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ఏడాదే అనౌన్స్‌మెంట్ ఉంటుంది. అదే కాకుండా నేను ఇంకొన్ని సినిమాలు చేస్తున్నా. -సంయుక్తతో ఓ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో సినిమా షూటింగ్ జరుగుతోంది.