calender_icon.png 20 January, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ నిర్మల బయోపిక్ రాయగలిగేది నేనే!

19-01-2025 10:09:20 PM

‘ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణంతో మొదలవుతోంది. నా కెరీర్‌లో బీజీయస్ట్ ఇయర్ 2025. మొన్న ‘బాహుబాలి’, నిన్న ‘పుష్ప2’, నేడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇలా తెలుగు సినిమా ప్రపంచమంతటా విజయ బావుటా ఎగురువేయడం గర్వంగా ఉంది. ఇలాంటి సినీ పరిశ్రమలో నేను ఇంత బిజీగా ఉంటూ విభిన్న పాత్రలతో ఇటు థియేటర్‌లో అటు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు నటుడు నరేశ్ విజయకృష్ణ. జనవరి 20 నరేశ్ వీకే బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..  సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్‌గా 52 పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. వృత్తిపట్ల ఉన్న అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యపడింది. ‘-ఈ సంవత్సరం విడుదలైన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇలా అన్ని తెలుగు సినిమాలు వంద కోట్లు దాటడం మన సక్సెస్. ప్రత్యేకంగా సంక్రాంతి వస్తున్నాం విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇందులో నేను చేసిన చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది బిగ్ సక్సెస్‌తో స్టార్ట్ అయ్యాను. ఈ సక్సెస్ అందరికీ  కొనసాగాలని కోరుకుంటున్నాను. -శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం.

నారా రోహిత్‌తో ‘సుందరకాండ’, ఇంద్రగంటితో ‘సారంగపాణి జాతకం’, రవితేజతో ఓ సినిమా చేస్తున్నాను. మారుతి రైటింగ్స్‌లో ‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రతి పాత్ర విభిన్నంగా ఉంటుంది. సీనియర్ డైరెక్టర్లతోపాటు యంగ్ డైరెక్టర్స్ నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం ఆనందంగా ఉంది. దాదాపు ఏడు సినిమాలు యువ దర్శకుల సారథ్యంలోనే చేస్తున్నాను. సమాజం నాకు ఎంతో ఇచ్చింది. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయమిది. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను.. సినిమా మ్యుజియం, లైబ్రేరీ, క్రియేటివ్ స్పెస్ ఫర్ యంగ్ పీపుల్.. దీన్ని ఘట్టమనేని ఇందిరాదేవి పేరుతో ప్రారంభించాం. అందులో విజయకృష్ణ మందిరం కూడా ఏర్పాటుచేశాం. నేను, పవిత్ర, దీన్ని ఒక మిషన్‌లా తీసుకొని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరుపై ఈ కార్యక్రమాన్ని ప్రాంభించాం. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. దీని లైఫ్ టైమ్ వర్క్ గురించి, ఇతర వివరాల గురించి త్వరలోనే తెలియజేస్తాం. జంధ్యాల, కృష్ణ, విజయనిర్మల నా గురువులు. గురువు జంధ్యాల లేకపోతే ఈ నటుడు లేడు. నాకు సినిమాల్లో ఓనమాలు దిద్దించారు. ఆయన్ను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని జంధ్యాల పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ ప్రారంభించాం. జంధ్యాలపై ఓ అద్భుతమైన పుస్తకం తయారుచేశాం. దీనికి సీనియర్ రైటర్ సాయినాథ్ సహకరించారు. ఈ పుస్తకాన్ని అమ్మ పుట్టిన రోజు ఫిబ్రవరి 20న రవీంద్రభారతిలో ఆవిష్కరిస్తున్నాం. 

ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయకృష్ణ అవార్డును అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. యోగిబేర్ కలెక్టివ్స్ వారు జంధ్యాల ఉత్సవాలు జరుపుతున్నారు. వారి థియేటర్‌లో జంధ్యాల నాటకాలు రెండు, ఆరు సినిమాలు ప్రదర్శించనున్నారు. 46 సినిమాలను తెరకెక్కించిన ఏకైక మహిళా దర్శకురాలిగా మా అమ్మ విజయ నిర్మల రికార్డు సృష్టించారు. ఆమెకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మాజీ సీఎం కేసీఆర్.. అవార్డుకు మా అమ్మ పేరును రికమెండ్ చేశారు. నా తల్లికే కాకుండా చాలా మంది గొప్పవారికి పద్మ అవార్డులు రావట్లేదు. బీజేపీ ప్రభుత్వం అర్హులకు ఇస్తుండటం సంతోషంగా ఉంది. తనయుడిగానే కాకుండా చిత్ర పరిశ్రమ వ్యక్తిగా మరోసారి ఆ పురస్కారం కోసం ప్రయత్నిస్తా. విజయ నిర్మల సహా చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన వారికి ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలి. కథలు రాస్తుంటా. ఓ కథను నిర్మాతలు ఓకే చేసి సెట్స్‌పైకి వెళ్లేలోపే వేరే బాధ్యతతో దాన్ని ఆపేశా. తప్పకుండా త్వరలోనే డైరెక్షన్ చేస్తా. అమ్మ బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. నా బయోపిక్ గురించి నువ్వు రాయి అని అమ్మ అంటుండేది.. మూడు పేజీలు రాశా.. అది నేనే రాయగలుగుతాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలకు పార్ట్ 2 చేయాలని ఉంది. సినిమాల నుంచే నాకు ఎనర్జీ వస్తుంది. సినిమా నా జీవితం. ఆఖరి శ్వాస వరకూ షూటింగ్‌లోనే ఉండాలని కోరుకుంటాను. పవిత్ర రాకతో తన జీవితం వచ్చిన మార్పుల గురించి చెప్తూ.. ‘టైటానిక్ ఒడ్డుకు చేరింది’ అని తెలిపారు.