calender_icon.png 4 February, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో చిత్రానికి గుమ్మడి కాయ కొట్టేసిన మోహన్‌లాల్

03-02-2025 11:44:38 PM

నటుడు మోహన్‌లాల్ మరో చిత్రానికి గుమ్మడి కాయ కొట్టేశారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి షెడ్యూల్ తాజాగా ముంబైలో ముగిసింది. ఈ సందర్భాన్ని సెట్‌లో చిత్రయూనిట్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘వృషభ’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మైథలాజికల్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో రాబోతోంది. తాజాగా షూటింగ్ పూర్తి కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేయనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ ఇలా అన్ని పనుల్ని ప్రారంభించబోతున్నారు.

ఈ మూవీని మలయాళం, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ప్రతీ సీన్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటుందని, ఇండియన్ సినీ హిస్టరీలో మరుపురాని చిత్రంగా నిలుస్తుందని ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.