హైదరాబాద్: మూడు రోజుల క్రితం తన నివాసంలో టెలివిజన్ జర్నలిస్ట్ గాయపడిన ఘటనపై ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 రిపోర్టర్ మైక్ లాక్కొని అతనిపై దాడి చేసిన నటుడు, జర్నలిస్ట్, సంస్థకు క్షమాపణలు చెప్పాడు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసిన మోహన్ బాబు, దురదృష్టకర సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక లేఖను పోస్ట్ చేశారు. మోహన్ బాబు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. జర్నలిస్ట్ పై దాడి ఘటన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు పిటిషన్ లో కోరారు.