31-03-2025 10:18:58 PM
యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్‌ఫోటో’ డైరెక్టర్ సందీప్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు బండి సరోజ్‌కుమార్ ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రను ‘నోలన్’గా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సరోజ్ క్యాండిల్‌తో సిగరెట్ వెలిగిస్తూ ఇంటెన్స్‌గా చూస్తూ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: రామ మారుతి ఎం;
సంగీతం: కాలభైరవ; ఎడిటర్: కోదాటి పవన్‌కళ్యాణ్; ఆర్ట్: కిరణ్ మామిడి; యాక్షన్: నటరాజ్ మాడిగొండ.