calender_icon.png 25 December, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన విచారణ.. ఇంటికి బయల్దేరిన పుష్పరాజ్

24-12-2024 03:13:36 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్య థియేటర్ కేసులో ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదమ్ అల్లు అర్జున్ ను విచారించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై మూడున్నర గంటలకు పైగా విచారించారు. న్యాయవాదుల సమక్షంలోనే ఆయనను పోలీసులు ప్రశ్నించారు. విచారణలో బన్ని వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు.

దాదాపు 20కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.  విచారణ సందర్భంగా అల్ల అర్జున్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. సంధ్య థియేటర్ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు పోలీసులు పేర్కొన్నారు. పోలీసు నోటీసులపై స్పందించిన బన్ని సోమవారం అర్థరాత్రి వరకు తన లీగల్ టీమ్ తో చర్చించారు. అనంతరం ఇవాళ చిక్కడపల్లి పీఎస్ లో విచారణకు తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కలిసి విచారణకు హాజరయ్యారు. విచార‌ణ అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసానికి బ‌య‌లుదేరాడు.