calender_icon.png 1 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలి

21-03-2025 12:41:37 AM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల, మార్చి 20 ( విజయక్రాంతి ) : లే అవుట్ల అభివృద్ధి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కార్యాచరణ రూపొందించి, సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం అయిజ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 751,957 ప్రాంతాల్లో లే అవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాంతాల్లో లేఅవుట్ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్,నీటి వనరుల అభివృద్ధి, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు,విద్యుత్ సరఫరా మరియు డ్రెయినేజ్ కనెక్షన్లను సమగ్రంగా అందుబాటులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్కు సంబంధించిన భూమిని పర్యవేక్షించి,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మంజూరు ప్రణాళికను సిద్ధం చేసి,అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో వేగంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత,పారదర్శకత పాటిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రావు మున్సిపల్ కమిషనర్ రాజయ్య,టౌన్ ప్లానింగ్ అధికారి కుర్మన్న,తహసీల్దార్లు జ్యోతి, టిపిఒ వరప్రసాద్,ఎ.ఈ లు,తదితరులు పాల్గొన్నారు.