calender_icon.png 22 April, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ విజయం అందించాలి

10-04-2025 02:10:42 AM

మాజీ మేయర్ సునీల్ రావు 

కరీంనగర్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కార్యకర్తలు బూత్ స్థాయిలో కష్టపడి పని చేస్తూ బిజెపి పార్టీకి విజయాలను అందించాలని బిజెపి నాయకుడు, మాజీ మేయర్ వై సునీల్ రావు అన్నారు.

బుధవారం నగరంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ అభియాన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రియాశీల సభ్యుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎప్పటికప్పటికీ ఎండగట్టాలని అన్నారు. 

ఈ  కార్యక్రమంలో అభియాన్ కన్వీనర్ ఎం ప్రకాష్, మాజీ పశ్చిమ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, జిల్లా ఎన్నికల కన్వీనర్ బండ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్, పర్వతం మల్లేశం, మామిడి రమేష్, బండారు శ్రీనివాస్, వంగల రవి, జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గోదారి నరేష్, బూత్ అధ్యక్షులు వినీత్, విష్ణు ప్రసాద్ రావు, పాలూజు ప్రకాష్, బండ రాకేష్, రమేష్, రవిచంద్ర, దయ్యాల మల్లేశం, శ్రీకాంత్, ఎర్రోళ్ల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు