09-04-2025 10:25:43 PM
బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరు సైనికుల్లా కదం తొక్కాలని టిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన చలో వరంగల్ పార్టీ పిలుపుమేరకు, బుధవారం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ సన్నాహక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని మండలాల నుంచి ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్ వెళ్లడానికి అన్ని మండలాల నాయకులకు జాన్సన్ నాయక్ దిశా నిర్దేశం చేశారు.
కార్యకర్తలను ప్రజలను సమన్వయపరచుకుని గులాబీ దండులా కదలాలని రాష్ట్ర మొత్తం కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ప్రజలు గుర్తించారని రాష్ట్రం క్షేమంగా ఉండాలంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో అన్ని మండలాల మాజీ జెడ్పిటిసిలు రాథోడ్ రాము నాయక్, జాను బాయ్, చంద్రశేఖర్, జయవంత్, పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజ గంగన్న, పట్టణ అధ్యక్షులు గౌరిక రాజు, చిట్టి మల్ల భరత్, అబ్దుల్ కలీల్, బిసి రాజన్న, వాల్ సింగ్, మాజీ ఎంపీపీ గోవింద్, మునీర్, సుద్దాల మైపాల్, నాయకులు పాల్గొన్నారు.