08-04-2025 01:05:39 AM
టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
హస్తినాపురంలో కాంగ్రెస్ బహిరంగ సభ
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మధుయాష్కీ
ఎల్బీనగర్, ఏప్రిల్ 7 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో భాగంగా సోమ వారం హస్తినాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో మధుయాష్కి గౌడ్ గారు మాట్లాడుతూ.. నాకు రాజకీయ వార సులు ఎవరూ లేరు .. కార్యకర్తలే నా వారసు లన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాం గ్రెస్ అధిష్టానం ఒప్పించి తెలంగాణ ఏర్పా టు కోసం పోరాటం చేశా... తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర , నీ చరిత్ర ఏంది సుధీర్ రెడ్డి..? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నేను పోరాటం చేస్తుంటే.. ఎక్కడ కబ్జాలు చేద్దామా? అని చెరువులు, కుంటల చుట్టూ సుధీర్ రెడ్డి తిరిగాడని విమర్శించారు. నువ్వు కార్పొరేట ర్ పోటీ చేసినప్పుడు ఆస్తులు ఎన్ని...? ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని..? అని ప్రశ్నిం చారు. కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలకు నిన్ను గెలిపిస్తే.. వారికి వెన్నుపోటు పొడిచి.. బీఆర్ ఎస్‌లోకి వెళ్లాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ ప్రభు త్వం డివిజన్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారని తెలిపా రు. రాజకీయాలక తీతంగా అభివృద్ధికి మేము సహకరిస్తున్నా మన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ప్రేమ ఉందని, కొడంగల్ మాదిరి గానే ఎల్బీనగర్‌ను అభివృద్ధి చేయడానికి నిధులు ఇస్తున్నారని తెలిపారు. జీహెచ్ ఎంసీ వసూలు చేసిన ప్రతి పైసా ఇక్కడే ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద, రోడ్డు డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, కాంగ్రెస్ నేతలు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, వజీర్ ప్రకాశ్ గౌడ్, గజ్జి భాస్కర్ యాదవ్, కార్పొరేటర్లు రాగుల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.